ఆప్ దే ఢిల్లీ మేయర్ పీఠం.. షెల్లీ ఒబెరాయ్ విజయం!
- సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు జరిగిన ఎన్నిక
- బీజపీ అభ్యర్థి రేఖ గుప్తాపై ఆప్ అభ్యర్థి షెల్లీ 34 ఓట్ల తేడాతో గెలుపు
- ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రాధాన్యతను ఇస్తానన్న షెల్లీ
గత డిసెంబర్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు ఎన్నిక జరిగింది. మరోవైపు షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ, లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు.