Drunk Driving: వైజాగ్ లో మందుబాబులకు చిత్రమైన శిక్ష... వీడియో ఇదిగో!

Judge orders drunk drivers go and clean RK Beach in Vizag all the day
షార్ట్స్‌లో చూడండి
వైజాగ్ నగరంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు 52 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయడమే మీకు విధిస్తున్న శిక్ష అని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని స్పష్టం చేశారు. 

దాంతో, పోలీసులు ఆ మందుబాబులను తీసుకుని బీచ్ కు వచ్చి, వారితో చెత్త ఏరివేత కార్యక్రమం షురూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Drunk Driving
Judge
RK Beach
Vizag

More Telugu News