నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ మధ్యాహ్నం మోకిలలోని తారకరత్న నివాసానికి వచ్చిన బాలకృష్ణ... తారకరత్నను విగతజీవుడిగా చూడడంతో భావోద్వేగాలకు గురయ్యారు. తారకరత్న భార్య అలేఖ్యను, ఆయన కుమార్తె నిషికను పరామర్శించారు. కాగా, తారకరత్న నివాసంలో బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని ఉండడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బాలయ్య, విజయసాయి చర్చించుకుంటూ కనిపించారు. తారకరత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురే. దాంతో విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు వరుస అవుతారు.