బంగారు భూగోళమా థాంక్యూ: చంద్రబోస్
- గోల్డెన్ గ్లోబ్ అవార్డు స్వీకరించిన గేయ రచయిత
- నాటు నాటు పాటకు వరించిన ప్రఖ్యాత అవార్డు
- ఆస్కార్ కు కూడా నామినేట్ అయిన నాటు నాటు
‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ మా కార్యాలయానికి వచ్చి నాటు నాటు పాటకు లభించిన పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబోస్ షేర్ చేశారు. ‘మనస్పూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా థాంక్యూ’ అని క్యాప్షన్ ఇచ్చారు. దాంతో, చంద్రబోస్ కు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘పట్టుకురండి చంద్రబోస్ గారు.. మన మణికొండకి.. మన అంజనీ గార్డెన్స్ కి.. మరోసారి శుభాభినందనలు మీకు’ అని మరో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.