పొరపాటు జరిగిందంటూ.. మాజీ ఉద్యోగులకు గూగుల్ క్షమాపణలు
- మాజీ ఉద్యోగులకు ఇచ్చే పరిహారంలో పొరపాటున కోత పెట్టిన గూగుల్
- అసలు విషయం తెలియక ఉద్యోగుల్లో టెన్షన్
- తప్పును సరిదిద్దుకున్న గూగుల్
- క్షమాపణలు చెబుతూ మాజీ ఉద్యోగులకు ఈ-మెయిల్స్
అయితే..ఇలా కేటాయించిన స్టాక్స్‌లో కోత విధించినట్టు గూగుల్ పొరపాటున మాజీ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించింది. పరిహారం లెక్కింపులో అనుకోకుండా జరిగిన పొరపాటుతో ఈ పరిస్థితి తలెత్తింది. కానీ..అసలు విషయం తెలియక ఉద్యోగులు తమ పరిహారంలో కోత పడిందనుకుని ఆందోళన చెందారు. ఈలోపు..జరిగిన తప్పును గుర్తించిన గూగుల్ వారికి క్షమాపణలు చెబుతూ ఈమెయిల్స్ పంపించింది.