రూ.1000 కోట్లకు చేరువైన ‘పఠాన్’
- 19 రోజుల్లోనే రూ.950 కోట్ల వసూళ్లు
- గత నెల 25న విడుదలైన చిత్రం
- షారుఖ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్
భారత్‌తో పాటు విదేశాల్లోనూ ‘పఠాన్’ జోరు కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ చేరనుంది. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్ గూఢచారిగా నటించారు. దీపికా పదుకొణే, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషించారు.