Raviteja: 'ధమాకా' నుంచి దండకడియాల్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ .. చూసేయండి!

  • రవితేజకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన 'ధమాకా'
  • సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించిన సంగీతం 
  • థియేటర్స్ లో హుషారెత్తించిన పాటలు 
  • మాస్ బీట్స్ తో అదరగొట్టేసిన భీమ్స్

Dhamaka Dandakadiyal Full Sing Released

రవితేజ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా 'ధమాకా' కనిపిస్తుంది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

రవితేజ జోడీగా శ్రీలీల నటించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బాణీలు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాయి. అలాంటి పాటల్లో 'దండకడియాల్ .. దస్తి రుమాల్' ఒకటి. ఈ పాటకి భీమ్స్ సాహిత్యాన్ని అందించడం, సాహితి చాగంటితో .. మంగ్లీతో కలిసి ఆలపించడం విశేషం.

థియేటర్లో ఈ పాటకి ఒక రేంజ్ లో విజిల్స్ పడ్డాయి. సాహిత్యం పరంగా .. బీట్ పరంగా .. కొరియోగ్రఫీ పరంగా ఈ పాటకి ఫుల్ మార్కులు పడిపోయాయి. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఫుల్ సాంగును రిలీజ్ చేశారు. రవితేజ అభిమానులకు మరింత హుషారెత్తించే విషయమే ఇది.

More Telugu News