Nani: 'దసరా' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

  • నాని హీరోగా రూపొందిన 'దసరా'
  • రెండోసారి ఆయన జోడీకట్టిన కీర్తి సురేశ్ 
  • సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ 
  • మార్చి 30వ తేదీన సినిమా రిలీజ్  

Dasara Movie Update

నాని ఈ మధ్య కాలంలో డిఫరెంట్ లుక్స్ లో కనిపించడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. అలా 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చేసిన నాని, ఆ తరువాత సినిమాగా 'దసరా' చేశాడు. ఎస్.ఎల్.వి. సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

నాని పక్కా మాస్ లుక్ తో కనిపిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన రెండో సినిమా ఇది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు.  'ఓరి వారి నీదు గాదుర పోరి .. ఇడిసెయ్ రా ఇంగ .. ఒడిసెను దారి' అంటూ ఈ పాట సాగుతోంది. 

ఈ సినిమాలో హీరో స్లాంగ్ కి తగినట్టుగానే సాహిత్యం .. ఆలాపన ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన పూర్తి పాటను వదలనున్నారు. సముద్రఖని .. సాయికుమార్ .. దీక్షిత్ శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, మార్చి 30వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

More Telugu News