Cars: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్

  • సరికొత్త ఉద్గార ప్రమాణాలతో బీఎస్-6
  • 2020 నుంచి నిలిచిపోయిన బీఎస్-4
  • రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ ప్రమాణాలు తీసుకువచ్చిన కేంద్రం
  • ఇప్పటికీ కొన్ని మోడళ్లలో కనిపించని ఆర్ డీఈ
  • మరికొన్ని వారాల్లో నిలిచిపోతున్న ఆర్ డీఈ రహిత వాహనాలు
Sales of cars non compliance with RDE norms halts from April 1

వాయు కాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలనే విక్రయించాలని కొత్త విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 2020లో కేంద్రం బీఎస్-4 వాహనాల విక్రయాలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, బీఎస్-6 వాహన ప్రమాణాల్లో ప్రత్యేకంగా ఆర్ డీఈ నిబంధనలు పొందుపరిచింది. 

ఆర్ డీఈ అంటే రియల్ డ్రైవ్ ఎమిషన్స్ అని అర్థం. కార్ల తయారీదారులు తమ మోడళ్లలో కర్బన ఉద్గారాలకు సంబంధించిన రియల్ టైమ్ డేటాను ప్రదర్శించే సాంకేతిక వ్యవస్థలను పొందుపరచాల్సి ఉంటుంది. అయితే, గతంలో రూపొందించిన కొన్ని కార్లలో రియల్ టైమ్ ఎమిషన్స్ డేటా చూపించే సాంకేతికత లేదు. ఇలాంటి పాత మోడళ్లకు కేంద్రం ఏప్రిల్ 1తో తుది గడువు విధించింది. 

ఈ నిబంధన నేపథ్యంలో, రెనో క్విడ్, అమేజ్ డీజిల్ వెర్షన్ (హోండా ఇప్పటికే విక్రయాలు నిలిపివేసింది), హోండా జాజ్, హోండా డబ్ల్యూఆర్-వి, ఫోర్త్ జనరేషన్ హోండా సిటీ, హ్యుండాయ్ ఐ20 డీజిల్ వెర్షన్, గ్రాండ్ ఐ20 నియోస్, ఆరా, మారుతి సుజుకి ఆల్టో 800, ఇగ్నిస్, సియాజ్, మహీంద్రా అల్టురాస్ జీ4 (దత్తత తీసుకున్న కొరియన్ బ్రాండ్), నిస్సాన్ కిక్స్, స్కొడా ఆక్టేవియా, సూపర్బ్ మోడళ్ల అమ్మకాలను ఆయా కంపెనీలు భారత మార్కెట్లో నిలిపివేయనున్నాయి.

More Telugu News