శ్రీవారి ఆర్జిత సేవలకు రేపటి నుంచే బుకింగ్
- లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయించనున్న టీటీడీ
- ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సేవలకు టికెట్లు
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
స్వామి వారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను ఈ నెల 9 న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ (https://ttdsevaonline.com) ద్వారా ఈ సేవలకు సంబంధించిన దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది. కాగా, మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 8 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారిని 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.