జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల విడుదల.. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే..!
- జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన తొలి విడత పరీక్షలు
- ఎన్‌టీఈ వెబ్సైట్లోకి వెళ్లడం ద్వారా పరీక్ష ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు
- అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే సరి
- ఏప్రిల్ 6 నుంచి జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు
తాజాగా, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వీటి ఫలితాలను విడుదల చేసింది. jeemain.nta.nic.in లేదంటే ntaresuts.nic.in వెబ్సైట్లోకి వెళ్లి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా, జేఈఈ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 12 వరకు జరగనున్నాయి. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారాన్ని https://jeemain.nta.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3న విడుదల చేయనుండగా, చివరి వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.