ఆ సినిమా విషయంలో నాకు చెప్పిందొకటి .. చేసిందొకటి: భానుప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమా విషయంలో నాకు చెప్పిందొకటి .. చేసిందొకటి: భానుప్రియ

Bhanupriya Special
  • 'నాట్యం' సినిమాను గురించి ప్రస్తావించిన భానుప్రియ  
  • ఆ సినిమాలో తన పాత్ర తనకి చెప్పినట్టుగా లేదని వ్యాఖ్య
  • షూటింగు సమయంలోనే తనకి అర్థమైపోయిందని వెల్లడి 
  • ఇకపై ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే చేస్తానని స్పష్టీకరణ   
అందం .. అభినయం .. నాట్యం కలగలిసిన రూపమే భానుప్రియ. తెలుగు తెరపై సంప్రదాయ నృత్యానికి సంబంధించి ఆమెకి వచ్చినంత పేరు మరొకరికి రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి భానుప్రియ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"ఈ మధ్య 'నాట్యం' అనే ఒక సినిమా చేశాను. నా పాత్ర చాలా బాగుంటుందనీ .. కథలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని చెప్పారు. అయితే, అందులో అంతలేదనే విషయం నాకు షూటింగు సమయంలోనే తెలిసింది. అప్పుడు మాట్లాడితే గొడవలవుతాయని నేను ఏమీ మాట్లాడలేదు" అన్నారు. 

" ఈ సినిమా చూసిన తరువాత 'ఎందుకు ఇలాంటి పాత్రలు చేస్తున్నారు? .. చేయకండి' అంటూ నా అభిమానులంతా మెసేజ్ లు పెట్టారు. ఇక అప్పటి నుంచి నా పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి పాత్రలు వస్తే చేయడానికి నేను రెడీగానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
Bhanupriya
Actress
Tollywood

More Telugu News