కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

Actor Sarath Kumar meets Kavitha
  • హైదరాబాద్ లోని కవిత నివాసంలో భేటీ
  • దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చ
  • బీఆర్ఎస్ గురించి అడిగి తెలుసుకున్న శరత్ కుమార్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాదులోని కవిత నివాసంలో ఆమెను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ స్థాపన, అజెండా, లక్ష్యాలను కవితను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే వీరి భేటీ జరిగినట్టు భావిస్తున్నారు. మరోవైపు శరత్ కుమార్ కు కవిత కాకతీయ తోరణం ప్రతిమను బహూకరించారు.
Go Back to Shorts
K Kavitha
BRS
Sarath Kumar
Tollywood

More Telugu News