శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ తీసుకువచ్చిన టీటీడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ తీసుకువచ్చిన టీటీడీ

TTD launches TT Devasthanams app
  • గతంలో గోవింద్ యాప్ ప్రవేశపెట్టిన టీటీడీ
  • ఆ యాప్ ను మరింత అభివృద్ధి పరిచిన వైనం
  • టీటీ దేవస్థానమ్స్ పేరిట అప్ డేటెడ్ వెర్షన్
  • తిరుమలలోని అన్ని సేవల వివరాలు లభ్యం
  • దర్శనం, గదులు, ఆర్జిత సేవల టికెట్లు బుకింగ్ సౌకర్యంతో యాప్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీనిపేరు 'టీటీ దేవస్థానమ్స్'. దీన్ని జియో ప్లాట్ ఫాంపై అభివృద్ధి చేశారు. టీటీ దేవస్థానమ్స్ యాప్ సాయంతో తిరుమలలో స్వామివారి దర్శనం, గదుల బుకింగ్, ఆర్జిత సేవా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. 

ఈ యాప్ లో తిరుమల పుణ్యక్షేత్రం చరిత్ర, శ్రీవారి సేవల వివరాలు కూడా ఉంటాయి. అంతేకాదు, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యక్రమాలను కూడా ఈ యాప్ లో వీక్షించవచ్చు. 

టీటీడీ గతంలో 'గోవింద' అనే యాప్ ను ప్రవేశపెట్టింది. 'గోవింద' యాప్ కు అప్ డేటెడ్ వెర్షనే ఈ 'టీటీ దేవస్థానమ్స్' యాప్. ఇదివరకే 'గోవింద' యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు దాన్ని అప్ డేట్ చేసుకుంటే, 'టీటీ దేవస్థానమ్స్' యాప్ లోకి ఆటోమేటిగ్గా ఎంటరవుతారు. లేకపోతే, నేరుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి 'టీటీ దేవస్థానమ్స్' యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీడీ వివరాలు తెలిపింది.
Advertisement
TT Devasthanams
APP
TTD
Tirumala

More Telugu News