Bheeshma Sujatha: పిఠాపురం రాజావారితో పెళ్లి .. కానీ ఆస్తులన్నీ పోయాయి: సీనియర్ నటి 'భీష్మ' సుజాత

Bheeshma Sujatha Interview
  • 'భీష్మ' సినిమాతో పేరు తెచ్చుకున్న సుజాత
  • సినిమాల్లోకి రావడానికి ముందే నాటకాల్లో అనుభవం 
  • కోర్టు అధీనంలోకి  రాజావారి ఆస్తులు వెళ్లినట్టుగా వెల్లడి
  • ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నామని వ్యాఖ్య   
60వ దశకంలో వెండితెరపై వెలిగిన నాయికలలో 'భీష్మ' సుజాత ఒకరు. 'భీష్మ' సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో అందరూ అలా పిలిచేవారు. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ సినిమాల్లోను ఆమె నటించారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజాత మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది 'తెనాలి'లో. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే ఎస్వీఆర్ .. జమున .. రామకృష్ణ ... శారదతో కలిసి నాటకాలు వేసేదానిని" అన్నారు. 

"నేను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలోనే 'పిఠాపురం' రాజావారిని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి ఆయనకి భార్య .. పిల్లలు ఉన్నారు. అయినా ఆమెను ఒప్పించి నన్ను చేసుకున్నారు. అప్పట్లో రాజావారు శ్రీమంతులు కావడం .. 'భీష్మ' సినిమాతో నాకు క్రేజ్ రావడంతో అందరూ మా గురించి గొప్పగా చెప్పుకున్నారు" అని అన్నారు.  

"అయితే .. మా పెళ్లి అయిన తరువాత రాజావారి ఆస్తులు కోర్టు అధీనంలోకి వెళ్లాయి. దానధర్మాల పేరుతో ఆయన పోగొట్టింది కూడా ఎక్కువే. అందువలన మళ్లీ నేను సినిమాల్లోకి వచ్చి కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది. ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ కాలేకపోయాననే ఒక బాధ మాత్రం ఉండిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు. 

Bheeshma Sujatha
Actress
Tollywood

More Telugu News