రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్న గవర్నర్
- రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
- అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైందన్న గవర్నర్
- కొత్త భవనాలు కట్టడం అభివృద్ధి కాదంటూ కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు
- కొంతమందికి తాను నచ్చకపోవచ్చని వ్యాఖ్య
పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని.. నేషనల్ బిల్డింగ్‌ను అభివృద్ధి అంటారని గుర్తు చేశారు. ఫామ్ హౌస్‌లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని అన్నారు. తెలంగాణతో తనకున్నది మూడేళ్ల అనుబంధం కాదని, పుట్టుకనుంచే ఉందని అన్నారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు కానీ.. తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పేర్కొన్నారు.