భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు
  • 773 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 226 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 850 పాయింట్లను కోల్పోయింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 773 పాయింట్లు నష్టపోయి 60,205కి పడిపోయింది. నిఫ్టీ 226 పాయింట్లు కోల్పోయి 17,891 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.14%), మారుతి (0.96%), టాటా స్టీల్ (0.54%), ఎన్టీపీసీ (0.39%), ఐటీసీ (0.21%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.26%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.78%), యాక్సిస్ బ్యాంక్ (-2.02%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.02%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News