అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఇక శనివారాల్లోనూ ఇంటర్వ్యూ!
- వీసాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న అభ్యర్థులు
- ఈ నెల 21న ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించిన దౌత్య కార్యాలయాలు
- వీసా దరఖాస్తుదారుల కోసం శనివారాల్లో ప్రత్యేక స్లాట్లు
- అమెరికా నుంచి భారత్‌కు మరింత మంది దౌత్య అధికారులు
అలాగే, గతంలో అమెరికా వీసా కలిగిన వారికి ఇంటర్వ్యూ లేకుండా రిమోట్ ప్రాసెసింగ్ విధానాన్ని అమెరికా విదేశాంగ శాఖ అమలు చేస్తోంది. వీసాల జారీ ప్రక్రియ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జనవరి-మార్చి మధ్య వాషింగ్టన్, ఇతర ఎంబసీల నుంచి పదుల సంఖ్యలో అధికారులు భారత్‌కు రానున్నారు. అదనపు అపాయింట్‌మెంట్ల కోసం ముంబై కాన్సులేట్ జనరల్ వారంలో పనిగంటల సంఖ్యను పెంచింది. ఈ వేసవికల్లా భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో అదనపు సిబ్బంది సాయంతో వీసాల జారీ ప్రక్రియ కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటుందని అమెరికా అధికారులు తెలిపారు.