5 స్టార్ హోటల్ కు రూ. 23 లక్షల బిల్లు ఎగ్గొట్టి వెళ్లిన వ్యక్తి అరెస్ట్
- ఢిల్లీలోని లీలా ప్యాలస్ హోటల్ కు టోకరా
- నిందితుడు దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్
- ఫేక్ కార్డుతో 3 నెలల పాటు హోటల్ లో ఉన్న వైనం
ఘటనకు సంబంధించి ఈ నెల 14న ఢిల్లీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. లీలా ప్యాలస్ హోటల్ జనరల్ మేనేజర్ అనుపమ్ దాస్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షరీఫ్ ఈ హోటల్ లో 2022 ఆగస్ట్ 1 నుంచి 2022 నవంబర్ 20 వరకు ఉన్నాడు.