తమిళ్ లో సాయి పల్లవికి బంపరాఫర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ్ లో సాయి పల్లవికి బంపరాఫర్

SaiPallavi is in talks for Ajith Kumar movie
  • అజిత్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి!
  • విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అజిత్
  • ఫిబ్రవరి నుంచి షూటింగ్
డ్యాన్సర్ నుంచి హీరోయిన్ గా మారిన సాయి పల్లవి దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా మనసుకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటిస్తుందామె. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటోంది. ప్రతీసారి వైవిధ్యం ఉండేలా చూసుకుంటుంది. గతేడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు జంటగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు ఓ భారీ ఆఫర్ ఆమెను వరించినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్‌కు జంటగా కనిపించనుందని సమాచారం. 

విఘ్నేష్‌ శివన్‌  దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించాయి. అయితే సాయిపల్లవిని ఫైనల్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు. కథతో పాటు తన పాత్ర నచ్చితేనే సాయి పల్లవి ఒప్పుకుంటుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి సాయి పల్లవి నటించడం ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవనుంది.
Advertisement
Kollywood
tamil
Sai Pallavi
ajith
movie

More Telugu News