గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన వ్యక్తి... సీపీఆర్ చేసి కాపాడిన ఐఏఎస్ అధికారి.. వీడియో ఇదిగో!
- చండీగఢ్‌లోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఘటన
- సకాలంలో స్పందించి సీపీఆర్ చేసిన ఐఏఎస్ అధికారి యశ్‌పాల్ గార్గ్
- వీడియోను షేర్ చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. యశ్‌పాల్ గార్గ్ సీపీఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారని, ప్రతి ఒక్కరు సీపీఆర్ నేర్చుకోవాలని కోరారు. కాగా, సీపీఆర్ చేసిన తర్వాత జనక్‌లాల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ వైద్యుల పరిశీలనలో ఉన్నారు.