షూటింగ్ లో శ్రుతి హాసన్ ఎక్కువ ప్రభావానికి గురైంది: సుస్మిత
- విదేశాల్లో గడ్డకట్టే చలిలో వాల్తేరు వీరయ్య పాటల షూటింగ్ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్య
- చలికి అందరూ ఇబ్బంది పడ్డారన్న కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత
- వస్త్రధారణలో పవన్ కల్యాణ్ యూత్ లో ట్రెండ్ సెట్టర్ అని ప్రశంస
ఈ చిత్రంలో లుంగీ, స్పోర్ట్స్ షూస్, కళ్లద్దాలతో చిరంజీవి బాగా కనిపించారని చెప్పారు. ఆయన ఎలాంటి దుస్తుల్లో అయినా బాగానే ఉంటారని, షూస్, జీన్స్, లెదర్ జాకెట్ వేసుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపించారని తెలిపారు. ఇక, రామ్ చరణ్ పర్సనల్ స్టైల్ స్టేట్‌మెంట్ అద్భుతంగా ఉంటుందని సుస్మిత చెప్పారు. తనకు సరిపోయే దుస్తులను ఎంచుకోవడంలో మంచి నైపుణ్యం ఉందని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూనే, పాశ్చాత్య శైలికి దగ్గరగా ఉంటుందని అన్నారు. తమ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వస్త్రధారణలో వాళ్లకంటూ సొంత శైలి ఉందని సుస్మిత వెల్లడించారు. బాబాయ్ పవన్ కల్యాణ్ అయితే యూత్‌లో ట్రెండ్ సెట్టర్ అన్నారు, ఆయనది యూనిక్ స్టైల్ అని, తను చెప్పులు వేసుకొని నడిచినా అందులో ఓ స్టైల్ ఉంటుందని చెప్పారు.