Slab: కూకట్ పల్లిలో స్లాబ్ కూలి ఇద్దరి మృతి

Two died after slab collapsed in Kukatpally
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదు కూకట్ పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆనంద్, దయ అనే ఆ ఇద్దరు కూలీలు యూపీకి చెందినవారు. వారి మృతదేహాలను వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో భారీ క్రేన్ సాయంతో శిథిలాలు వెలికితీశారు. 

ఈ భవన యజమాని జీ ప్లస్ 2 అనుమతి తీసుకుని ఐదంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్టు గుర్తించారు. నాలుగో అంతస్తుకు స్లాబ్ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యజమానిపై కేసు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు.
Go Back to Shorts
Slab
Collapse
Dearh
Workers
Kukatpally
Hyderabad

More Telugu News