హైదరాబాదులో షూటింగులో గాయపడిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి

Bollywood star director Rohit Shetty injured in Hyderabad
  • నగర శివార్లలో షూటింగ్
  • యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అపశ్రుతి!
  • రోహిత్ శెట్టిని ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించిన యూనిట్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి షూటింగ్ లో గాయపడ్డారు. హైదరాబాదు శివార్లలో ఆయన ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణ సందర్భంగా గాయాలపాలయ్యారు. దాంతో సెట్స్ పై తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే షూటింగ్ నిలిపివేసి రోహిత్ శెట్టిని ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు బలమైన దెబ్బలు తగిలినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 

కాగా, రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. 

నిర్మాతలు ఈ షెడ్యూల్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ షెడ్యూల్ లో కార్ చేజింగ్ లు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Go Back to Shorts
Rohit Shetty
Hyderabad
Shooting
Web Series

More Telugu News