స్టేట్ టెర్రరిజంను అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: నక్కా ఆనందబాబు
- జీవో నెంబర్ 1ను తెచ్చి జగన్ రాక్షసానందం పొందుతున్నారన్న ఆనందబాబు
- చీకటి జీవోలతో ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకుంటున్నారని మండిపాటు
- అంబేద్కర్ సాక్షిగా జగన్ పతనం ప్రారంభమయిందని వ్యాఖ్య
కొందరు పోలీసు అధికారులను చూస్తే బాధేస్తోందని... పోలీసులు కూడా తమకు ఏమిటి ఈ ఖర్మ అని బాధపడుతున్నారని అన్నారు. జగన్ సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విలువలు లేని పాలన సాగుతోందని... స్టేట్ టెర్రరిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని చెప్పారు. మరోవైపు నక్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.