Ananthababu: అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైకోర్టు తీర్పు
  • 15 రోజుల్లోగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారికి ఆదేశం
  • తుది ఛార్జ్ షీట్ ను మూడు నెలల్లోగా దాఖలు చేయాలని ఆదేశం
AP HC denies to handover MLC Ananthababu case to CBI

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసును సీబీఐకి అప్పగించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వ్యక్తులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫుటేజ్ కు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. 

హత్య విషయంలో వారి పాత్రను నిర్ధారించి వాటికి సంబంధించిన వివరాలతో అదనపు అభియోగ పత్రాలను దాఖలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తుది చార్జ్ షీట్ ను మూడు నెలల్లో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్యం తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలను వినిపించారు.

  • Loading...

More Telugu News