Ravivarma: 'ప్రత్యర్థి' సినిమాతో టాలీవుడ్ కి మరో కొత్త దర్శకుడు!

  • డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన 'ప్రత్యర్థి'
  • కథానాయికగా అక్షత పరిచయం
  • కీలకమైన పాత్రలో రవివర్మ
  • ఈ నెల 6వ తేదీన విడుదలవుతున్న సినిమా
Prathyarthi Movie Update

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్స్ లోని సినిమాలకు ఎప్పుడూ జనాల్లో ఆదరణ ఉంటుంది. సరైన కథాకథనాలు ..  గ్రిప్పింగ్ స్క్రీన్‌ ప్లేతో సినిమాలు తీస్తే జనాలు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి జోనర్లోనే 'ప్రత్యర్థి' సినిమా రాబోతోంది. జనవరి 6న రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈ మూవీతోనే శంకర్ ముడావత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

ఎన్నో ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్న శంకర్ ముడావత్, అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు సంపాదించుకున్నాడు. దేవ కట్టా తెరకెక్కించిన 'ఆటోనగర్ సూర్య' సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ నరోజ్ వద్ద అసిస్టెంట్‌ కెమెరామెన్‌గాను పనిచేశాడు. ఇలా ఇప్పుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు దర్శకుడిగా రాబోతున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రత్యేకంగా చూపించారు. సినిమా బాగుందని, కొత్త దర్శకుడైనా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని అభినందించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. నిర్మాణం పరంగా ఎక్కడా రాజీపడకుండా సంజయ్ సహ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ నెల 6వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాలో, రవివర్మ .. రోహిత్ బెహల్ .. అక్షత ప్రధానమైన పాత్రలను పోషించారు.

More Telugu News