అమిత్ షా ఒక ఊసరవెల్లి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

Kumaraswamy fires on Amit Shah
  • గోబెల్స్ కొత్త రూపమే అమిత్ షా అన్న కుమారస్వామి 
  • ఎనిమిదేళ్ల కాలంలో దేశాన్ని విధ్వంసం మార్గంలోకి తీసుకెళ్లారని విమర్శ 
  • జేడీఎస్ కన్నడిగులకు ఏటీఎంగా మారుతుందని వ్యాఖ్య 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి. జోసెఫ్ గోబెల్స్ కొత్త రూపమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత ఎనిమిదేళ్ల పాలనలో మన దేశాన్ని విధ్వంస మార్గంలోకి తీసుకెళ్లారని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

బీజేపీ ఒక కపట పార్టీ అయితే, అమిత్ షా ఊసరవెల్లి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటు వేయాలని... జేడీఎస్ పార్టీ కన్నడిగులకు ఏటీఎంగా మారుతుందని కుమారస్వామి చెప్పారు. తాము పేదలు, కూలీలు, రైతుల ఏటీఎంగా మారుతామని అన్నారు. ఏటీఎం అంటే ఎనీటైమ్ హ్యుమానిటీ అని చెప్పారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. జేడీఎస్ సంక్షోభ పార్టీగా మారిందని... వచ్చే ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
Advertisement
Kumaraswamy
JDS
Amit Shah
BJP

More Telugu News