ఆ ఒక్క విషయంలో చరణ్ కు, నాకు అస్సలు పోలిక లేదు: చిరంజీవి
- వాల్తేరు వీరయ్యలో స్టిల్స్ 1991ను గుర్తుచేస్తున్నాయని వ్యాఖ్య
- 30 ఏళ్ల తర్వాత కూడా తనలో అదే జోష్ కనిపిస్తోందన్న మెగాస్టార్
- 80 ఏళ్లు వచ్చినా కుర్రవేషాలు వేయాలని ఉందన్న చిరు
డిసెంబర్ 31న తాను యువకుడిగా ఉన్నప్పటి నుంచి అందరిలాగా పార్టీలకు వెళ్లేవాడిని కాదన్నారు. కాలేజీ రోజుల నుంచి పెళ్లైన చాలా రోజుల దాకా డిసెంబర్ 31 రాత్రి 11.30 నుంచి పూజ గదిలో ఆంజనేయస్వామి ముందు కూర్చుని ధ్యానం చేసుకొనేవాడినన్నారు. 12 గంటల తర్వాత టపాసుల చప్పుడు అయినప్పుడు లేచి అందరికీ శుభాకాంక్షలు చెప్పేవాడినని చెప్పారు. తన భార్య సురేఖ ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోందన్నారు. తన కుమారుడు రామ్ చరణ్ తనలాగే అందరూ తన కుటుంబమే అనుకుంటాడని చిరు చెప్పారు.
అయితే, చరణ్ చాలా గుంభనంగా ఉంటాడు, తాను చాలా ఓపెన్‌గా ఉంటానని, ఈ ఒక్క విషయంలో మాత్రం తమ ఇద్దరికీ పోలిక లేదు. చరణ్–ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం తెలిసి చాలా సంతోషపడ్డానని మెగాస్టార్ చెప్పారు. కొడుకు, కోడలు ఆ మాట చెబుతుంటే ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యానని, ఆ రోజు కోసం ఆరేళ్ల నుంచి వేచి చూస్తున్నామని అన్నారు.