ట్విట్టర్ హెడ్డాఫీసు అద్దె కట్టట్లేదట.. కంపెనీపై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేసిన యజమాని
- అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ప్రధాన కార్యాలయం
- 1.36 లక్షల డాలర్లు అద్దె బకాయి పడిందంటున్న ఓనర్
- వివిధ దేశాల్లోని ఆఫీసులకు రెంట్ చెల్లించడంలేదని ఆరోపణలు
అయితే, ఇటీవల కొన్ని వారాల నుంచి ట్విట్టర్ అద్దె చెల్లించట్లేదని కొలంబియా రెయిత్ ఆరోపించింది. దీనిపై గత నెల 16న ట్విట్టర్ కు నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్విట్టర్ పై కోర్టులో దావా వేసినట్లు ఓ ప్రకటనలో వివరించింది. కాగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన అద్దె కూడా ట్విట్టర్ చెల్లించడంలేదని సమాచారం. దీనిపై పలు మీడియా సంస్థలు ట్విట్టర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆ కంపెనీ స్పందించలేదు.