గతేడాది 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!
- 2022లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు
- హతమైన వారిలో ఎక్కువమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులే
- అంతకుముందు ఏడాదితో పోలిస్తే 37 శాతం తగ్గిన టెర్రరిస్ట్ రిక్రూట్‌మెంట్లు
గతేడాది 100 మంది ఉగ్రవాదులు వివిధ ర్యాంకుల్లో చేరారు. గతేడాది ఉగ్రవాదుల్లో చేరినవారి సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 37 శాతం తగ్గింది. మొత్తం రిక్రూట్ అయిన ఉగ్రవాదుల్లో 65 మందిని సైన్యం కాల్చి చంపింది. 17 మందిని అరెస్ట్ చేసింది. ఇంకా 18 మంది క్రియాశీలంగా ఉన్నారు.