Prabhas: రాజమౌళి గారు ఫుట్ బాల్ ఆడేస్తారని రానాతో ముందే చెప్పాను: ప్రభాస్

  • 'ఛత్రపతి' ద్వారా రాజమౌళి గురించి తెలిసిందన్న ప్రభాస్  
  • నిజంగా ఆయన చాలా గొప్ప మనిషి అంటూ కితాబు 
  • ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఉందని వెల్లడి 
  • తన యాక్టింగ్ చూసి విశ్వనాథ్ గారు అలా అన్నారన్న ప్రభాస్
Prabhas Interview

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ 'ఛత్రపతి' సినిమా చేశాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రభాస్ స్థాయిని మరింత పెంచింది. ఆ తరువాతనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' సినిమా చేశాడు. 'ఛత్రపతి' సినిమా సమయంలోనే రాజమౌళి గురించి తెలిసుండాలి కదా? అయినా బుద్ధి రాలేదా? మళ్లీ ఆయనతో 'బాహుబలి' సినిమా చేశావు? అని బాలకృష్ణ అడిగారు. 

ఆందుకు ప్రభాస్ స్పందిస్తూ .. 'ఛత్రపతి' సినిమాతోనే రాజమౌళి గారి గురించి నాకు తెలిసిపోయింది. ఆయన విషయంలో నాకు అనుభవం ఉందిగానీ .. రానాకి ఇంకా తెలియదు. 'మనవాడు కాస్త ఫుట్ బాల్ ఆడుకుంటాడు' అని ముందుగానే నేను రానాకి చెప్పాను. కాకపోతే అలాంటి సినిమాలో మళ్లీ మళ్లీ ఛాన్స్ రాదు గనుక కష్టపడి చేశాము. 

'ఛత్రపతి' సినిమా షూటింగు మొదలైన నాలుగు రోజులకే రాజమౌళిగారు చాలా గొప్ప మనిషి అనే విషయం నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఆయనకి మంచి స్నేహితుడినైపోయాను. 'ఛత్రపతి'లోని ప్రతి సీన్ ను ఒకటి రెండు టేక్స్ లోనే పూర్తి చేస్తూ వెళ్లాను. నేను ఏది అనుకుంటే అది చేసే ఫ్రీడమ్ ఇచ్చారు. జనం ఉన్నప్పుడు నేను సైలెంట్ గా డైలాగ్ చెబుతానని అంటే కూడా ఓకే అనేవారు. 'ఇలాగైతే ఎలాగయ్యా' అని 'మిస్టర్ పెర్ఫెక్ట్ షూటింగులో కె విశ్వనాథ్ గారు అన్నారు కూడా" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News