Anant Ambani: ఘనంగా ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి నిశ్చితార్థం

Anant Ambani and Radhika Merchant receive grand welcome at Antilia

  • రాజస్థాన్ లోని శ్రీనాథ్ జీ టెంపుల్ లో నిర్వహణ
  • ముంబైలోని ఆంటీలియా వద్ద ఘన స్వాగతం
  • అంబానీ విందుకు పెద్ద ఎత్తున హాజరైన సెలబ్రిటీలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, ఎంకోర్ హెల్త్ కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ తో వివాహం ఖరారైంది. ఇందుకు సంబంధించి నిశ్చితార్థం రాజస్థాన్ లో పూర్తి కాగా, అనంతరం ముంబైలోని ముకేశ్ అంబానీ ఆంటీలియా ప్యాలస్ వద్ద వారికి ఘన స్వాగతం పలికారు. గురువారం రాత్రి ముకేశ్ అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

అనంత్ అంబానీ, రాధిక చాలా కాలంగా ఒకరికొకరు పరిచయస్థులు. రాజస్థాన్ లోని నాధ్వారాలో శ్రీనాథ్ జీ టెంపుల్ వద్ద వీరి నిశ్చితార్థం గురువారం జరిగింది. అక్కడి నుంచి వీరిద్దరూ ముంబైలోని ఆంటీలియాకు చేరుకున్నారు. మేళతాళాలతో ఘగ స్వాగతం లభించింది. అదే రోజు రాత్రి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయడంతో ముకేశ్, నీతా అంబానీ దంపతుల నివాసం సందడిగా మారిపోయింది. 

షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, అలియాభట్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, మికా సింగ్, జాన్వీకపూర్ తదితరులు పార్టీకి విచ్చేశారు. ఈ పార్టీలో అనంత్, రాధిక కూడా చిందులు వేశారు. ముకేశ్, నీతా అంబానీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ కవలలు. వారికి ఇంతకు ముందే వివాహాలు జరిగాయి. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం క్లిక్ చేయండి)


Anant Ambani
Radhika Merchant
engagement
mumbai
antelia
celebrities
grand party
reliance
Mukesh Ambani
  • Loading...

More Telugu News