భద్రతా నియమాలను రాహుల్ 113 సార్లు ఉల్లంఘించారు: సీఆర్ పీఎఫ్
- తమ సెక్యూరిటీ ఏర్పాట్లలో లోపంలేదని వెల్లడి
- జోడో యాత్రలో రాహుల్ గాంధీకి సెక్యూరిటీ పెంచాలన్న కాంగ్రెస్
- కేంద్ర హోంమంత్రికి ఆ పార్టీ రాసిన లేఖకు సీఆర్ పీఎఫ్ వివరణ
జోడో యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన తర్వాత జనం రద్దీ పెరిగిందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జనం రాహుల్ గాంధీకి అతి సమీపంలోకి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి రక్షణ కల్పించాల్సి వచ్చిందని వెల్లడించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. రాహుల్ కు సెక్యూరిటీ మరింత పెంచాలని హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఈ లేఖపై సీఆర్ పీఎఫ్ స్పందించి, సెక్యూరిటీ వివరాలతో వివరణ ఇచ్చింది.