గూగుల్ లో 6 శాతం ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన?
- సుమారు 10,000 మంది ఉద్యోగుల తొలగింపునకు అవకాశం
- వీరి పనితీరు ఆశించిన విధంగా లేనట్టు సమాచారం
- అధికారికంగా ఇంకా ప్రకటించని గూగుల్
గత వారం ఉద్యోగుల పనితీరుపై గూగుల్ ఓ సమావేశం కూడా నిర్వహించింది. గూగుల్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించనుందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాలు దీనికి అనుగుణంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటి వరకు గూగుల్ ఉద్యోగుల తొలగింపుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 6 శాతం మందిని గూగుల్ తొలగిస్తుందా? లేక పనితీరు మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఇస్తుందా? చూడాలి. మరోవైపు అమెజాన్, ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించడం తెలిసిందే.