వీకెండ్ తరువాత కూడా తగ్గని 'ధమాకా' జోరు!

Dhamaka movie update
  • ఈ నెల 23న వచ్చిన 'ధమాకా'
  • రోజుకి 10 కోట్ల వసూళ్లు 
  • 4 రోజుల్లో 41 కోట్ల గ్రాస్
  • శ్రీలీల గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ  
  • రవితేజ ఖాతాలో హిట్ పడినట్టే   
రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు 'ధమాకా' సినిమాను రూపొందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన జర్నీని మొదలుపెట్టింది. తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 

మూడు రోజుల్లో ఈ సినిమా 30 కోట్లకి పైగా వసూలు చేసింది. వీకెండ్ తరువాత ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలనుకున్నారు. నిన్న సోమవారం రోజున కూడా ఈ సినిమా వసూళ్లు ఎంతమాత్రం తగ్గలేదు. నాలుగు రోజులను కలుపుకుని ఈ సినిమా 41 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

రవితేజ పాత్రను నక్కిన త్రినాథరావు మలిచిన తీరు .. రవితేజ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు ఉండటం .. భీమ్స్ అందించిన మాస్ బీట్స్ .. మాస్ స్టెప్పులు .. ఫైట్లకి తోడు శ్రీలీల గ్లామర్ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పాలి.
Advertisement
Raviteja
Sreeleela
Jayaram
Rao Ramesh
Dhamaka Movie

More Telugu News