భక్తులు అత్యధికంగా సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండోస్థానం
- మొదటి స్థానంలో వారణాసి
- కరోనా ఆంక్షల సడలింపుతో తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
- గదుల బుకింగ్‌లో తిరుపతి ఫస్ట్
ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ఆలయాల్లో వారణాసి మొదటి స్థానంలో నిలవగా, తిరుమల ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, తిరుపతిలో పర్యాటకుల గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే 233 శాతం పెరిగినట్టు ఓయో రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, షిరిడీ ఉన్నాయి.