రిజర్వేషన్ల విషయంపై సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ
- కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలన్న ముద్రగడ
- గత ఎన్నికల్లో జగన్ విజయానికి కాపులు కృషి చేశారని వ్యాఖ్య
- రిజర్వేషన్లు కల్పించి మరోసారి కాపులు ఓట్లు వేసేలా చూసుకోవాలని సూచన
గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మినహా అన్ని చోట్ల జగన్ గెలుపుకు కాపులందరూ కృషి చేశారని... ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లు కల్పించి మరొకసారి కాపు జాతి తమరి విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుదని అన్నారు.
మరోవైపు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇటీవల మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఆర్టికల్ 342 ఏ(3) ప్రకారం కాపులకు రిజర్వేషన్లు కల్పించొచ్చని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రాలకు కేంద్రం నుంచి అనుమతి అవసరం లేదని అన్నారు.