కోహ్లీ, రోహిత్ శర్మలతో పోల్చదగ్గ ఆటగాడు పాకిస్థాన్ జట్టులో ఒక్కరూ లేరు: డానిష్ కనేరియా
- పాక్, ఇంగ్లండ్ మధ్య ముగిసిన టెస్టు సిరీస్
- 3-0తో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్
- పాక్ ఆటగాళ్లలో మాటలు తప్ప చేతల్లేవన్న కనేరియా
- సున్నా చుట్టారంటూ విమర్శలు
"మాటలు చూస్తే కోటలు దాటతాయి... ఫలితాలు చూపించండి అంటే మాత్రం సున్నా చుడతారు. టెస్టు కెప్టెన్సీ విషయంలో బాబర్ అజామ్ పెద్ద గుండు సున్నా. జట్టుకు నాయకత్వం వహించే సామర్థ్యం అతడికి ఎంతమాత్రం లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో అతడు కెప్టెన్ గా పనికిరాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా బెన్ స్టోక్స్, బ్రెండన్ మెకల్లమ్ వంటి వారి నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకునే అవకాశం బాబర్ కు లభించింది. లేకపోతే, తన ఇగోను పక్కనబెట్టి మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ ను అడిగి కెప్టెన్సీ ఎలా చేయాలో తెలుసుకోవాలి" అంటూ కనేరియా ఓ వీడియోలో వ్యాఖ్యానించాడు.