Jagan: తలసేమియా బాధిత చిన్నారికి సీఎం జగన్ చేయూత

CM Jagan assures best treatment for Sanvika
  • ప్రకాశం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్
  • దర్శి ఎమ్మెల్యే తనయుడి వివాహ రిసెప్షన్ కు హాజరు
  • సీఎంను కలిసిన చిన్నారి శాన్విక తల్లిదండ్రులు
  • మెరుగైన వైద్యం అందించాలంటూ సీఎం ఆదేశాలు
ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా, తలసేమియాతో బాధపడుతున్న శాన్విక అనే చిన్నారితో కలిసి ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చారు. శాన్విక పరిస్థితి పట్ల సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారితోనూ, ఆమె తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి తప్పకుండా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. తలసేమియాతో బాధపడుతున్న శాన్వికకు మెరుగైన వైద్యం అందించాలంటూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Jagan
Sanvika
Thalassemia
Darshi
Prakasam District
YSRCP
Andhra Pradesh

More Telugu News