ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో ‘పఠాన్’ ప్రమోషన్
- ఖతార్ వేదికగా ప్రమోషన్ కార్యక్రమం
- పాల్గొననున్న షారుఖ్, దీపికా పదుకుణే
- వచ్చే నెల 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ విడుదల
వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. దీంతో షారుఖ్, దీపికా సినిమా ప్రమోషన్ పై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఖతార్ లో ప్రమోషన్ కార్యక్రమం చేయనున్నారు. ఇందుకోసం దీపికా పదుకుణే, షారుఖ్.. ఇద్దరూ ఖతార్ చేరుకున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను షారుఖ్ ఇప్పటికే వెల్లడించారు.
స్పెయిన్, యూఏఈ, టర్కీ, రష్యా, సైబీరియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇండియా, అప్ఘనిస్థాన్‌లలో పఠాన్ సినిమా షూటింగ్ జరుపుకుందని మూవీ యూనిట్ వెల్లడించింది. సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన బేషరమ్ రంగ్ పాటను ఇప్పటికే విడుదల చేయగా.. పాటలో అశ్లీలత మోతాదు ఎక్కువైందని, దీపిక వేసుకున్న కాస్ట్యూమ్స్ మరీ కురచగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.