పాలేరులో వైఎస్సార్టీపీ కార్యాలయానికి భూమి పూజ చేసిన షర్మిల.. వీడియో ఇదిగో!
- వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్న షర్మిల
- హైదరాబాద్ వెలుపల పార్టీ తొలి కార్యాలయం
- సంక్రాంతి తర్వాత పాదయాత్రను కొనసాగించనున్న షర్మిల
వచ్చే ఏడాది తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాలేరులో పార్టీ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు, షర్మిల పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, సంక్రాంతి తర్వాత పాదయాత్రను మళ్లీ కొనసాగించనున్నట్టు ఆమె ప్రకటించారు.