ప్యూర్ ఈవీ నుంచి అతి త్వరలో ఎలక్ట్రిక్ మోటారు సైకిల్
- జనవరిలో ఆవిష్కరణకు అవకాశం
- ఒక్కసారి చార్జ్ తో 135 కిలోమీటర్ల ప్రయాణం
- ఐసీఈ మోటారు సైకిల్ కు ఏ మాత్రం తీసిపోదంటున్న సంస్థ
ఈకో డ్రిఫ్ట్ పేరుతో రానున్న ఈ మోటార్ సైకిల్ లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ప్యూర్ ఈవీ సొంతంగా అభివద్ధి చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 135 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా స్థిరమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని ఈ మోటార్ సైకిల్ ఇస్తుందని ప్యూర్ ఈవీ చెబుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ (ఐసీఈ) మోటారు సైకిళ్లతో పోలిస్తే ఎందులోనూ తీసిపోదని అంటోంది. దీని ధరను జనవరిలో ప్యూర్ ఈవీ ప్రకటిస్తుంది.