వాట్సప్ లో సరికొత్త ఫీచర్.. ఒకసారి చూడగానే మెసేజ్ మాయం!
- ఫీచర్ ను పరీక్షిస్తున్న యాప్
- రహస్య సందేశాలు పంపించే వాళ్లకు ఉపయోగపడనున్న ఫీచర్
- ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో అందుబాటులోకి
అలాగే దాన్ని స్క్రీన్‌షాట్ కూడా తీయలేడు. ఎవ్వరికీ ఫార్వర్డ్ చేయలేరు. రిసీవర్ చదివిన వెంటనే ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. పంపించిన వాళ్ల ఫోన్లో కూడా అది మళ్లీ కనిపించదు. తమ వాట్సాప్ చాట్ ను ఎవ్వరూ చూడకుండా ఉండాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.