ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు... రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ
- హోదా అంశంపై ప్రశ్నించిన వైసీపీ ఎంపీ
- హోదాపై తన వైఖరిని వెల్లడించిన కేంద్రం
- లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్
వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ)కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని వెల్లడించారు. 14వ ఆర్థికసంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంశంలో ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి స్పందించారు.