హోటల్ గదిలో విద్యార్థినికి మత్తుమందు ఇచ్చి ప్రిన్సిపాల్ అత్యాచారం!

Principal sexual Assaults School girls in meerut
  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
  • టూర్ కోసం 9 మంది బాలికలను బృందావన్ తీసుకెళ్లిన ప్రిన్సిపాల్
  • 11వ తరగతి అమ్మాయిపై అత్యాచారం
  • ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు
టూర్ పేరుతో విద్యార్థినులను తీసుకెళ్లి ఓ విద్యార్థినికి మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రిన్సిపాల్. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గత నెల 23న 9 మంది విద్యార్థినులను టూర్ పేరుతో బృందావన్‌కు తీసుకెళ్లాడు. అనంతరం రాత్రి బస కోసం ఓ హోటల్‌లో రెండు రూములు అద్దెకు తీసుకున్నాడు. 8 మందిని ఓ గదిలో ఉంచగా, 11వ తరగతి చదువుతున్న మరో విద్యార్థినిని తన గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. బాలిక మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. 

బాలిక ప్రతిఘటించడంతో ప్రిన్సిపాల్ ఆమెను బెదిరించాడు. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. టూర్‌ ముగిసిన అనంతరం 24న విద్యార్థినులను తీసుకుని ప్రిన్సిపాల్ వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత బాధిత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh
Meerut
Principal
School Girls

More Telugu News