తెలంగాణ మళ్లీ టీఆర్ఎస్ దే: కేటీఆర్
- కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోందన్న కేటీఆర్
- ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యాఖ్య
- దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్న మంత్రి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. వ్యవసాయం, ఐటీ, పర్యావరణం, పరిశ్రమలు, పట్టణాభివృద్ది తదితర అంశాలతో సమతుల్యమైన కొత్త ఇంటెగ్రేటెడ్ హోలిస్టిక్ మోడల్ ను దేశం ముందు ఉంచామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు చేస్తున్న కుట్రలు ఫలించవని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. మరోవైపు, జగిత్యాలలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.