ఎగ్జిట్ పోల్స్ పై కేజ్రీవాల్ ఏమన్నారంటే..!
- గుజరాత్ లో ఆప్ ప్రభావం అంతంతేనని తేల్చిన ఎగ్జిట్ పోల్స్
- పార్టీ ఓట్ల శాతం పెంచుకుంటుందని అంచనాలు
- తొలి ప్రయత్నంలోనే 15% నుంచి 20% ఓట్లు దక్కించుకోవడం సానుకూలమన్న కేజ్రీవాల్
తొలిసారి పోటీ చేసినప్పటికీ దాదాపు 20 శాతం ఓట్లను దక్కించుకోవడమంటే మాటలు కాదని కేజ్రీవాల్ చెప్పారు. అదికూడా బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫలితాలు రాబట్టడం సాధారణ విషయం కాదని చెప్పారు. గుజరాత్ ప్రజల మనసులను తాము గెలుచుకున్నామనేందుకు ఈ అంచనాలే నిదర్శనమని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పార్టీకి సానుకూలంగానే భావిస్తున్నట్లు కేజ్రీవాల్ వివరించారు.
మరోపక్క, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తేలింది. ఇక, హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ ప్రభావం చూపించలేదని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి.