madras: మతం మారిన తర్వాత ఇక కులం కొనసాగదు!: మద్రాసు హైకోర్టు

Can not carry original caste to converted religion says Madras HC
షార్ట్స్‌లో చూడండి
ఇస్లాం స్వీకరించిన హిందువు వెనుకబడిన తరగతి (బీసీ) అభ్యర్థిగా రిజర్వేషన్ ప్రయోజనాలను డిమాండ్ చేయగలరా? ఈ ప్రశ్నకు మద్రాసు హైకోర్టు ప్రతికూల సమాధానం ఇచ్చింది. ఒక వ్యక్తి మతం మారిన తర్వాత ఇకపై అతను పుట్టిన కులం అతనికి వర్తించదని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సివుందని పేర్కొంది. 

నిమ్న వర్గానికి చెందిన కులంలో హిందువుగా జన్మించిన అక్బర్ అలీ పిటిషన్‌పై జస్టిస్ జి ఆర్ స్వామినాథన్ ఈ తీర్పును వెలువరించారు, అక్బర్ అలీ అత్యంత వెనుకబడిన తరగతి (ఎంబిసి) కేటగిరీ కిందకు రాలేడని చెప్పారు. అక్బర్ అలీ  2008లో ఇస్లాం మతంలోకి మారి తన పేరు మార్చుకున్నాడు. అతను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. 

అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ కింద కాకుండా ఓపెన్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణించబడినందున అతను ఉద్యోగానికి ఎంపిక అవ్వలేదు. ఈ విషయంలో తనను మినహాయించాలని కోరుతూ అక్బర్ కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ స్వామినాథన్ అతని అభ్యర్థనను తోసిపుచ్చారు. ‘మతాన్ని మార్చుకున్నతర్వాత కూడా ఆ వ్యక్తికి రిజర్వేషన్ల ప్రయోజనం ఇవ్వాలా? వద్దా? అనేది అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్న. ఈ విషయం సుప్రీంకోర్టు అధీనంలో ఉన్నందున ఈ కోర్టు ఎలాంటి తీర్పునివ్వదు. పిటిషనర్ విషయంలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న వైఖరి సరైనది. దీనిలో కోర్టు ఎటువంటి జోక్యాన్ని కోరుకోదు’ అని స్పష్టం చేశారు.
Go Back to Shorts
madras
High Court
caste
religion
convert

More Telugu News