షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- షర్మిల పాదయాత్రకు అనుమతించాలంటూ వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్
- నర్సంపేట పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారంటూ ఆరోపణ
- టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని కోర్టుకు నివేదన
- అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచన
3,500 కిలో మీటర్ల మేర ప్రశాంతంగా సాగిన షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అనుమతి నిరాకరించారని వైఎస్సార్టీపీ తన పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్ జిల్లా లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు యాత్రపై దాడికి యత్నించారని ఆరోపించింది. ఈ పిటిషన్ పై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు... షర్మిల పాదయాత్రకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.